మంత్రము
మంత్రం అనగా, మననాత్ త్రాయతే ఇతి మంత్రం. మననాత్ అంటే విచారణ ద్వారా
అంటే ఆలోచన ద్వారా మంత్ర అంతరార్ధము కులంకషముగా తెలుసుకొనడం.
త్రాయతే అంటే రక్షిచ్చడం. ఇది త్రా అనే ధాతువు నుండి వచ్చింది. ఓం కూడా త్రా ధాతువు నుండే వచ్చింది అని అంటారు పండితులు.
కాబట్టి మంత్ర అర్ధము తెలుసుకొని దాని పై విచారణ చే ఒక మంచి అవగాహన వచ్చినప్పుడు ఆ మంత్రము మనలను రక్షిస్తుంది.
కాబట్టి మంత్రములు, శ్లోకములు వాటి అర్ధము తెలుసు కొని వాటి జప-పఠనములు చేసినపుడు మనకి సంపూర్ణ ఫలితము వస్తుందని పెద్దలు గురువులు అంటారు.
మహా మృత్యుంజయ మంత్రం
ఇది మహా గొప్ప మంత్రము. ఈ మంత్రము ఆరోగ్యానికి, వ్యాధులనుండి బయటపడటానికి, అకాల మరణాన్ని తప్పిచ్చడానికి , చివరికి ఆత్మ సిద్ధికీ మరియు జీవన్ముక్తి-మోక్షాదులకు కుడా చాలా ఉపయోగపడుతుంది.
ఓం త్రయంబకం యజామహే
సుగంధిం పుష్టివర్థనం
ఉర్వారుకమివ బంధనాన్
మృత్యోర్ ముక్షీయ మా మృతాత్
త్రయంబకం - త్రయ అంటే మూడు, ఇంగ్లీష్ భాషలో, త్రి, ఇందులోనుండే వచ్చినది.
అంబకం అంటే కళ్ళు. మూడు కన్నులు కల వాడు, అంటే శివుడు. అందుకే శివుడిని ముక్కంటి అనికూడా అంటాము. త్రయంబకం ఇంకొక అర్ధము సూర్యుడు, చంద్రుడు, అగ్ని. ఇవి సృష్టికి మూలకారణం, వీటి మూలము-స్వరూపము శివుడే.
యజామహే - మేము ప్రార్థిస్తాము
సుగంధిం - సుగంధము ఆంటే మంచి పరిమళము. ఒక పువ్వుకి మంచి సువాసన ఎప్పుడు వస్తుంది, మొగ్గగా వున్నప్పుడు కాదు, వాడి పోతున్నప్పుడూ కాదు, ఈ రెండిటికి మధ్యలో, ఆంటే మంచి యవ్వనంలో వున్నప్పుడు కదా ఆ సుగంధము. కాబట్టి సుగంధము అంటే యవ్వనము, ఆ యవ్వనము, బలము మరియు తేజములకు చిహ్నములు . అందుకే మనము గుడులలో, శివుడు, దక్షిణామూర్తి, కృష్ణుడు, రాముడు, ఆది శంకరుడు, ఇత్యాది విగ్రహాలను - చిత్రాలను చూసినప్పడు అవి నిత్య యవ్వనము-చిరునవ్వుతో ఉంటాయి.
పుష్టివర్ధనం - పుష్టి అంటే ఆరోగ్యం. వర్ధనం అంటే పెంపొందిచ్చడము. పుష్టివర్ధనం అంటే ఆరోగ్యవృద్ధిని కలిగించేవాడు, మనము ఆరోగ్యముగా ఉండుటకు కారకుడు, ఆ శివుడు.
ఉర్వారుకమ్, ఇవ, బంధనాత్, మృత్యో: , ముక్షీయ - ఉర్వారుకమ్ అంటే పుచ్చ కాయ, ఉర్వారుకమ్ ఇవ బంధనాత్ మృత్యో: ముక్షీయ - అంటే ఎలాగైతే పక్వానికి వచ్చిన పుచ్చకాయ చాలా సులువుగా తొడిమె నుండి విడిపోతుందో అలాగే మనలను మృత్యువు నుండి అంతే తేలికగా విడదీయుట.
మా అమ్రుతాత్ - ఆ అమృతత్త్వము నుండి మాత్రము విడదీయకు సుమా! అని అర్ధము.
ఇక్కడ అమృతత్త్వము ఆంటే జీవన్ముక్తి, జన్మరాహిత్యం ఆంటే మరు జన్మ లేకపోవటం,మోక్షము అని అర్ధము.
తాత్పర్యము
మూడు నేత్రములు కలవాడిని, ముక్కంటిని, బలము-తేజముల సుగంధము కలవాడిని, మాకు ఆరోగ్యాన్ని, దాని పోషణని మరియు వృద్ధిని ఇచ్చువాడిని, పక్వానికి వచ్చిన పుచ్చకాయ, తొడిమ నుండి విడదీయబడినంత సులువుగా మృత్యువునుండి మనలను విడదీయువాడిని, మనకు ఆత్మా సిద్ధిని, జీవన్ముక్తిని, మోక్షాన్ని ప్రసాదించువాడిని మేము ప్రార్ధిస్తున్నాము.
Wednesday, January 20, 2021
Maha Mrtunjaya Matram - word by word meaning (Telugu)
Subscribe to:
Posts (Atom)